Saturday 22 December 2012

...మంచి Vs చెడు...

మనలో ప్రతీ క్షణం మంచి,చెడుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది...ఒక్కోసారి ఒక్కోటి గెలుస్తుంటుంది

ఒకడు ఎలాంటి వాడు అనేది ఏది ఎక్కువసార్లు గెలుస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది

ఉదాహరణకు...
రోడ్డు మీద వెళ్తూ ఉంటాం...రోడ్డు పక్కన ఒక పావురం కాలుకి దెబ్బ తగిలి కింద పడి ఉందనుకుందాం...మనకు జాలేస్తుంది చేతిలోకి తీసుకుని కట్టు కట్టి గాల్లోకి ఎగరేస్తాం...మనసుకి చిన్న సంతృప్తి


కొంచెం ముందుకి వెళ్ళాక హోటల్ లోంచి చికెన్ బిర్యాని ఘుమఘుమలు వస్తుంటాయి..లోనికి వెళ్లి లాగించేస్తాం...
ఆ క్షణాన మనకు తెలుసు...మనం ఒక కోడి ప్రాణం తీస్తున్నామని...దాని పీక కోసినప్పుడు అది గిల గిల కొట్టుకుని చచ్చిపోతుందని...అయినా ఎందుకు తింటామంటే అప్పుడు మన ఆలోచనల్లో జాలిపైన ఆశ దాడి చేసి గెలుస్తుంది
.

Saturday 15 December 2012

-----అదే నీ వ్యక్తిత్వం----

హుందాతనం ఉండాల్సింది బాహ్య దేహంపై  కనిపించే
        దుస్తుల్లోనో,వాడే వస్తువుల్లోనో కాదు

        అంతరాత్మలో దాగి వుండే వ్యక్తిత్వంలో

ఎవరూ తొంగి చూడలేని మనసు లోతుల్లో
                           నువ్వు ఎలా ఆలోచిస్తావో...
ఎవరూ నిన్ను గమనించరని నిశ్చయంగా తెలిస్తే
                            నువ్వు ఎలా  ప్రవర్తిస్తావో...
            -----అదే నీ వ్యక్తిత్వం----

Saturday 8 December 2012

.......సూర్యుడు ఉదయించాలన్నది ఆశ............

...సూర్యుడు ఉదయించి అలాగే ఉండిపోవాలన్నది దురాశ...
 
......సూర్యుడు ఉదయించడు అన్నది నిరాశ........

Who Can Understand The Diff Between These 3 Will Rock In Their Life
నిన్ను ఇష్టపడే వాళ్ళు ఎక్కువగా...ద్వేషించేవాళ్ళు తక్కువగా ఉండాలంటే
ముఖ్యంగా చేయాల్సింది ఒక్కటి

ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు...వాళ్ళను భాదపెట్టే మాటలు మాట్లాడకుండా ఉండాలి

Tuesday 4 December 2012


మానవులందరూ భేదరహితంగా ఒకేలా కలిసిపోయే చోట్లు రెండే రెండు...

ఒకటి దేవాలయం
రెండు శ్మశానం

మనిషి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత పవిత్రతను పాటిస్తాడో...శ్మశానికి వెళ్ళేంత వరకు తన జీవితంలో అంతే పవిత్రతను పాటించగలగాలి.

Saturday 24 November 2012

తప్పు చేసినా దొరికే అవకాశం లేదు, ప్రశ్నించే వాళ్లు ఎవరూ లేరు అనిపిస్తే విచ్చలవిడిగా తప్పులు చేస్తాం...

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తాం.

పైరసీ సినిమాలు చూస్తాం.

లంచం ఇచ్చి పనులు చేయించుకుంటాం.

ఎవ్వరూ చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అది నీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది

Life Should Be like a Tour

మనం విహార యాత్రకి వెళ్ళినప్పుడు ఒక్క రోజు కూడా వృధా చేయకుండా పక్కా ప్రణాళికతో చూడాలనుకున్నవన్నీ చూస్తాం

జననంతో జీవితం అనే యాత్ర కోసం భూమి అనే ప్రదేశానికి వచ్చాం ఒక్కరోజు కూడా వృధా చేయకుండా మన కర్తవ్యాన్ని నెరవేర్చి మరణంతో వదిలి వెళ్ళాలి

Saturday 17 November 2012

Listen 'n' Learn

చాలా మంది ఎదుటి వారు చెప్పేది వినడం కన్నా, ఎదుటి వారికి ఏదైనా చెప్పటంలోనే ఎక్కువ ఆసక్తి చూపుతారు.
మానసికంగా నిలకడను కోల్పోతున్న ఆధునిక సమాజంలో అవసరాన్ని మించి మాట్లాడడం సర్వ సాధారణమయిపోయింది.


మనలో చాలా మందికి ఎదుటి వారు చెప్పింది వినటానికి 'అహంకారం' అడ్డొస్తుంది

ఎలాంటి పక్షపాతం లేకుండా ఎదుటి వారి ఆలోచనలను, అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటూ ముందుకు వెలుతున్నామంటే మన అస్త్రాలపొదిలో కొత్త కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లే.

వినటానికి సహనం, నిష్పాక్షికత, అర్థం చేసుకోవాలనే కోరిక ఉండాలి ఇవన్నీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి చిహ్నాలు.


'Learn Everything that is Good From Others, and in Your Own Way Absorb it, do not Become Others.'-Vivekananda

Tuesday 30 October 2012

దేవుడంటే...

చిన్నప్పుడు...
దేవుడంటే నమ్మకం ఉండేది
"మనం మంచి చేస్తే మనకు మంచి చేస్తాడు...మనం చెడు చేస్తే మనకు చెడు చేస్తాడు" అని

కొన్ని రోజుల క్రితం వరకు...
దేవుడంటే అసహ్యం ఉండేది
అసలు దేవుడనే వాడెవడూ లేడు అదంతా ఓ అభూత కల్పన...మాయలు చేస్తాడు,మహిమలు చూపిస్తాడు అంటే నవ్వొచ్చేది

కానీ ప్రస్తుతం...
దేవుడంటే ఇష్టం

సమాజం బాగు కోరుకునే గొప్ప కవులచే సృష్టించబడిన పాత్రలే దేవుళ్లు...
ఇన్నేళ్ల నా జీవితంలో నేను నేర్చుకున్న సత్యాలు...ఆ కవుల కావ్యాల్లోని భావాలు దగ్గరగా ఉండడం ఆ దేవుడి పట్ల నాకు ఇష్టాన్ని ఏర్పర్చింది.

కృష్ణుడు అర్జునుడికి గీతాసారం అంతా భోదించాక చివరికి ఒకే మాటతో ముగించాడు
"విశ్లేషించుకుని అన్వయించుకో" అని

నాకు విశ్లేషించుకోవడానికి ఇన్నేళ్లు పట్టింది...అన్వయించుకునే ప్రయత్నంలో వున్నాను