చాలా మంది ఎదుటి వారు చెప్పేది వినడం కన్నా, ఎదుటి వారికి ఏదైనా చెప్పటంలోనే ఎక్కువ ఆసక్తి చూపుతారు.
మానసికంగా నిలకడను కోల్పోతున్న ఆధునిక సమాజంలో అవసరాన్ని మించి మాట్లాడడం సర్వ సాధారణమయిపోయింది.
మనలో చాలా మందికి ఎదుటి వారు చెప్పింది వినటానికి 'అహంకారం' అడ్డొస్తుంది.
ఎలాంటి పక్షపాతం లేకుండా ఎదుటి వారి ఆలోచనలను, అభిప్రాయాలను లెక్కలోకి తీసుకుంటూ ముందుకు వెలుతున్నామంటే మన అస్త్రాలపొదిలో కొత్త కొత్త ఆయుధాలను సమకూర్చుకుంటున్నట్లే.
వినటానికి సహనం, నిష్పాక్షికత, అర్థం చేసుకోవాలనే కోరిక ఉండాలి ఇవన్నీ ఉన్నతమైన వ్యక్తిత్వానికి చిహ్నాలు.
'Learn Everything that is Good From Others, and in Your Own Way Absorb it, do not Become Others.'-Vivekananda
No comments:
Post a Comment