Saturday 22 December 2012

...మంచి Vs చెడు...

మనలో ప్రతీ క్షణం మంచి,చెడుల మధ్య ఘర్షణ జరుగుతూ ఉంటుంది...ఒక్కోసారి ఒక్కోటి గెలుస్తుంటుంది

ఒకడు ఎలాంటి వాడు అనేది ఏది ఎక్కువసార్లు గెలుస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది

ఉదాహరణకు...
రోడ్డు మీద వెళ్తూ ఉంటాం...రోడ్డు పక్కన ఒక పావురం కాలుకి దెబ్బ తగిలి కింద పడి ఉందనుకుందాం...మనకు జాలేస్తుంది చేతిలోకి తీసుకుని కట్టు కట్టి గాల్లోకి ఎగరేస్తాం...మనసుకి చిన్న సంతృప్తి


కొంచెం ముందుకి వెళ్ళాక హోటల్ లోంచి చికెన్ బిర్యాని ఘుమఘుమలు వస్తుంటాయి..లోనికి వెళ్లి లాగించేస్తాం...
ఆ క్షణాన మనకు తెలుసు...మనం ఒక కోడి ప్రాణం తీస్తున్నామని...దాని పీక కోసినప్పుడు అది గిల గిల కొట్టుకుని చచ్చిపోతుందని...అయినా ఎందుకు తింటామంటే అప్పుడు మన ఆలోచనల్లో జాలిపైన ఆశ దాడి చేసి గెలుస్తుంది
.

1 comment:

  1. మొదటి యుగం లో మంచి వాల్లు మాత్రమే ఉండెవాల్లు. .రెండో యుగం లో మంచి వాల్లు చెడ్డ వాల్లు వేరు వేరుగ ఉండెవాల్లు. .మూడో యుగం లో మంచి వాల్లు చెడ్డ వాల్లు కలిసె ఉండెవాల్లు. .కాని ఇది కలియుగం ప్రతి మంచి వాడిలో ఒక చెడ్డ వాడు ఉంటడు, ప్రతి చెడ్డ వాడిలో ఒక మంచి వాడు ఉంటడు. .

    ReplyDelete